VJY, June 6: విజయవాడ వచ్చినందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. విజయవాడ అంటే విజయానికి సంకేతం అన్నారు. బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో నడ్డా పాల్గొని ( vijayawada meeting) ప్రసంగించారు. సోమవారం ఆయన శక్తి కేంద్రాల ప్రముఖులతో భేటీ అయ్యారు. అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం ఇది అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి బీజేపీ(BJP) అవసరం చాలా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా(JP Nadda) అన్నారు.
ఏపీ అభివృద్ధిపై సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలని ఆయన (Bjp national president jp nadda) సూచించారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో పది వేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయన్నారు. ప్రతి బూత్ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు తెలిపారు. కమిటీల ఏర్పాటు ప్రక్రియ నెలలో పూర్తి కావాలని ఆదేశించారు.
స్థానిక సమస్యలపై ప్రతి బూత్ కమిటీలో చర్చించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని నేతలకు తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీగా మార్చిందని అన్నారు. ఆరోగ్యశ్రీ జగన్ పథకం కాదని.. కేంద్ర ప్రభుత్వ పథకమని చెప్పుకొచ్చారు. సౌభాగ్య కార్యక్రమం రెండున్నర కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నామని జేపీ నడ్డా పేర్కొన్నారు.
రాష్ట్రంలో 46 వేలకు పైగా బూత్ లు ఉన్నాయని..బూత్ లు వారీగా ప్రజల వద్దకు పార్టీని తీసుకువెళ్లాల్సిన బాధ్యత శక్తి కేంద్రాలపై ఉందని నడ్డా తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో బృహత్తర ఆరోగ్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దాన్నే ఆరోగ్యశ్రీ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని చెప్పారు. అది జగన్ స్కీం కాదని నరేంద్రమోదీదని నడ్డా తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో రూ. 5 లక్షల వరకు వైద్యసాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జేపీ నడ్డా సూచించారు. ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా పనిచేస్తుందని రాష్ట్రం దాటితే ఆరోగ్య శ్రీ పనికిరాదని ఆయన వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్ కింద ఏటా రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.