Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, Feb 23: ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meet) కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు ప్రధాన ఎజెండాగా కేబినెట్‌లో చర్చిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టి పలు బిల్లులను కూడా మంత్రివర్గం ఆమోదించనుంది. తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపైనా చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఏయే శాఖ‌, ప‌థ‌కాల‌కు ఎంత కేటాయించాల‌న్న అంశాల‌పై ఇప్ప‌టికే ప్ర‌ణాళిక రూపొందిచుకున్న నేప‌థ్యంలో వాటిపై కూడా స‌మాలోచ‌న‌లు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన హామీలు, ఉద్యోగుల పంపకం, తదితర అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఎలా ఉండాలనే దానిపై కేబినెట్‌లో చర్చకు అవకాశం ఉంది. విశాఖ ఉక్కు, కార్మికుల ఉద్యమం, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉంది.మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన నిధుల‌పై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు రాష్ట్రానికి సంబంధించిన‌ పలు అంశాలపై చర్చిస్తారు.

పనితీరు కనబర్చిన వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర పేర్లతో సత్కారాలు, ఉగాది రోజున కార్యక్రమం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్

మార్చిలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు.. సంక్షేమ పథకాలతో పాటూ కీలక అంశాలపై చర్చించనున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలని భావిస్తున్నారట.. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న ప‌లు నిర్ణయాలకు మంత్రివ‌ర్గం‌ ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది.

ఇక పంచాయితీ ఎన్నికల పూర్తి అయ్యాయి. మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాక వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు వైసీపీ సర్కారు సిద్ధమవుతోంది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు అసెంబ్లీ భేటీ ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో మార్చి 2 నుంచి మన్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.

10,890 మంది సర్పంచ్ లు నేరుగా ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపిన ఎస్ఈసీ, పోలీసుల పని భేష్, ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

మార్చి 10న ఎన్నికలు, మార్చి 14న కౌంటింగ్ ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటిని క్రోడీకరించే పనిలో బీజీగా ఉంది. ఓవైపు ఎన్నికలు ఎదుర్కొంటూనే మరోవైపు బడ్జెట్‌ అంచనాలను సిద్ధం చేస్తోంది.

వచ్చేనెల మూడో వారంలో నిర్వహించ తలపెట్టిన అసెంబ్లీ సమావేశాలు రెండు వారాల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బడ్జెట్‌తో పాటు ఇతర అంశాలకూ చోటు కల్పించనున్నారు.