Amaravati, July 29: తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నిన్నఏపీలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులను పరామర్శించారు. ముంపు ప్రాంతాలన్నిటినీ కలిపి ప్రత్యేక పోలవరం జిల్లాగా చేస్తా. పోలవరం కోసం త్యాగం చేసిన వారికి కానుకగా ఇస్తానని ప్రకటించారు.
అనంతరం తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మీదుగా వేలేరుపాడు, కుకునూరు మండలాలకు వెళ్లారు.అక్కడ పర్యటన అనంతరం సాయంత్రానికి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, సారపాక చేరుకుని వరద బాధితులను పరామర్శించారు. పోలవరం విలీన మండలాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) శుక్రవారం భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్(TDP Chief)ను భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదేం వీరయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఐదు విలీన గ్రామాలు తిరిగి తెలంగాణ(Telangna)లో కలిపేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా చంద్రబాబును పొదేం వీరయ్య విజ్ఞప్తి చేశారు.
ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు, ప్రజలు వరదల్లో ఏమైపోయినా తమకేంటి అనుకుంటున్నారా అంటూ ధ్వజం
టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శివాజీ (Shivaji) ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నాడు సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో శ్రీ సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
Here's Chandrababu Visits Bhadrachalam Visuals
భద్రాద్రి వద్ద కరకట్టను చంద్రబాబుగారు పరిశీలించారు. ఇరవై ఏళ్ల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మింపచేసిన కరకట్ట అది. ఆ కరకట్ట వల్లే భద్రాచలం సురక్షితంగా ఉందని ప్రజలు చంద్రబాబు గారితో చెప్పి సంతోషం వ్యక్తం చేసారు. (2/2) pic.twitter.com/RN0s7h7zYm
— Telugu Desam Party (@JaiTDP) July 29, 2022
దాదాపు 19 సంవత్సరాల తర్వాత టీడీపీ అధినేత ఈరోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయంలోని శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండతులతో చంద్రబాబు వేదాశీర్వచనం పొందారు. అనంతరం స్వామివారి జ్ఞాపిక, స్వామి వారి లడ్డు ప్రసాదాలను చంద్రబాబుకు ఆలయ ఈఓ అందజేశారు.భద్రాద్రి సీతారామయ్య దర్శనం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) భద్రాచలం కరకట్ట (Bhadrachalam karakatta)ను పరిశీలించారు.
చంద్రబాబు మాట్లాడుతూ... 20ఏళ్ల క్రితం కట్టిన కరకట్టను ప్రజలు ఈనాటికీ గుర్తుపెట్టుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ సమస్యను స్వయంగా పరిశీలించానని చెప్పుకొచ్చారు. చేసిన అభివృద్ధి సామాజిక సేవా శాశ్వతంగా ఉండటం ఎంతో తృప్తి నిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్న చిన్నపాటి లోటుపాట్లను ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. విలీన గ్రామాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టి బాధిత ప్రజలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు సూచించారు.
మరోవైపు భద్రాచలంలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులతో విడిగా సమావేశమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. స్థానికంగా ఎదురయ్యే సమస్యలను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విలీన ఐదు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబుకు వివరించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చొరవ చూపాలని నేతలకు టీడీపీ అధినేత సూచన చేశారు. సెప్టెంబర్‌లో ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకావాలని నేతలు కోరగా... తప్పక హాజరవుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఖమ్మం సభ తర్వాత తెలంగాణాలో పార్టీ పూర్వ వైభవానికి కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.