Representative Image

Krishna, August 31: ఏపీలోని కృష్ణా జిల్లాలో మహిళా హోంగార్డును మోసం చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) ఎస్‌ఐని ‘దిశ’ పోలీసులు అరెస్టు చేశారు. ‘దిశ’ డీఎస్పీ రాజీవ్‌కుమార్‌ మంగళవారం ఈ కేసు వివరాలను మచిలీపట్నంలో మీడియాకు వెల్లడించారు. కృష్ణా జిల్లా (Krishna District) బంటుమిల్లి సబ్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కొమ్మా కిరణ్‌కుమార్‌.. బందరు సబ్‌జైలులో పని చేస్తున్న మహిళ హోంగార్డుతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా నాలుగేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.

ప్రభుత్వ టీచర్ కాదు కామాంధుడు, నాలుగేళ్ల చిన్నారిపై అదే పనిగా లైంగిక దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, తమిళనాడులో దారుణ ఘటన

దీంతో పాటు ఆమె వద్ద పలుమార్లు డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇటీవల ఇంటి అవసరాల నిమిత్తం కిరణ్‌ను ఆమె డబ్బులడిగింది. ‘డబ్బులివ్వను.. ఏమి చేసుకుంటావో చేసుకో’ అంటూ అతను బెదిరించడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు సోమవారం ‘స్పందన’లో ఎస్పీ జాషువాకు ఫిర్యాదు (Cheating Complaint against excise SI) చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే ఎస్‌ఐ కిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ‘దిశ’ పోలీసులను ఆదేశించారు. ‘దిశ’ డీఎస్పీ రాజీవ్‌కుమార్‌ కేసు నమోదు చేసి 24 గంటల్లో కిరణ్‌ను అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు రాజీవ్‌ చెప్పారు.