CM Jagan (Photo-APCMO/X)

AP CMO Press Meet: ఏపీలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడాకూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్‌, లాంచ్‌, పోస్ట్‌ లాంచ్‌ కార్యక్రమాలు ఉంటాయి. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్‌ చేసుకోవాలి. జనవరి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.3 వేలకు పెంచుతాం. రూ.3 వేలకు పెన్షన్‌ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు.

తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించిన ఏపీ ప్రభుత్వం, ఐజీగా ప్రమోషన్ పొందిన ఏలూరు రేంజ్‌ డీఐజీ వీజీ అశోక్‌ కుమార్‌

‘‘మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్‌ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,250 లు చేశాం. ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం. నెలకు 400 కోట్ల మాత్రమే గత ప్రభుత్వంలో సగటున పెన్షన్ల కోసం ఖర్చు చేసేవారు. ఇప్పుడు నెలకు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం. మన రాకముందు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు, ఇప్పుడు 66 లక్షలు. ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు,

ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి. ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం. ఆదివారమైనా, పండుగైనా సరే ఒకటో తారుఖీన చిక్కటి చిరునవ్వుతో పెన్షన్‌ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగాం. ఈ మార్పును ఎలా తీసుకు రాగలిగామన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం పేర్కొన్నారు.

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 వ్యాప్తి, ముందస్తు చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్, ఏపీలో రెండు కోవిడ్ కేసులు

రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుంది. నాలుగో కార్యక్రమం వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది. ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్‌ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగే లోపే దాదాపు 1.7 లక్షల పెన్షన్లు ఒకటో తేదీ నుంచే ఇస్తారు. 66,34,742మందికి రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి’’ అని సీఎం తెలిపారు.

మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి. పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా నేను 3వ తేదీన కాకినాడలో పాల్గొంటున్నాను. అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తేదీనే ప్రారంభం అవుతుంది. ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్‌ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. దీనిపె షెడ్యూలు చేసుకోవాలి.

8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్‌ కానుక కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్‌తోపాటు నా తరఫున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి. అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, ఉత్సహవంతులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలి’’ అని సీఎం పేర్కొన్నారు.

చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ అందిస్తున్నాం. దీనికోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను నెలకొల్పాం. దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్‌ డబ్బు ఇవ్వలేదు. మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేసింది. ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలి. ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.’’ అని సీఎం తెలిపారు.

‘‘మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలు పూర్తిగా కుదేలైపోయాయి. ఏ గ్రేడ్‌, బి గ్రేడ్‌ సంఘాలు మరింతగా పడిపోయాయి. 18శాతం పైచిలుకు అక్కౌంట్లన్నీకూడా అవుట్‌ స్టాండింగ్‌, ఎన్‌పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మనం వారికి చేయూత నిచ్చి ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం.

క్రమం తప్పకుండా ప్రతి ఏటా లబ్ధిదారులకు అందించగలిగాం. అందుకనే ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్‌పీఏలు 0.౩శాతానికి చేరాయి. అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడు ఉంటే ప్రభుత్వం మనది. ఆసరా కోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం. మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,,195 కోట్లు ఇచ్చాం. చివరి విడతగా 6,394 కోట్లు ఇస్తున్నాం. జనవరి 23 నుంచి 31వ తేదీ వరకూ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు’’ అని సీఎం చెప్పారు.