 
                                                                 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, సీపీ పరిశీలించారు. సీఎం జగన్ సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటలకు విశాఖకి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు గేట్–1లో అధికారులు, ప్రజాప్రతినిధుల్ని కలవనున్నారు.
అనంతరం రోడ్డు మార్గంలో ఎన్‌ఏడీ జంక్షన్‌కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకోనున్నారు. అక్కడ రూ. 150 కోట్లతో నిర్మించిన ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్‌డీఏ రూ. 36.32 కోట్లతో పూర్తి చేసిన మరో 6 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 5.45 గంటలకు ఏయూ కన్వెన్షన్ హాల్‌లో విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని సీఎం ఆశీర్వదించనున్నారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులో ఉన్న వుడా పార్కుకి చేరుకొని రూ. 61.01 కోట్లతో జీవీఎంసీ పూర్తి చేసిన 4 స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు.
సాయంత్రం 7 గంటలకు పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదిస్తారు. రాత్రి 7.55 గంటలకు విశాఖ నుంచి గన్నవరానికి సీఎం బయలుదేరనున్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
