Satish Dhawan Space Centre (Photo-Twitter)

Srihari Kota, Jan 18: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరువక ముందు మరో సూసైడ్ కలకలం రేపుతోంది. సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ వికాస్‌ సింగ్‌ భార్య ప్రియా సింగ్‌ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రోజున ఆత్మహత్యకు పాల్పడిన వికాస్‌సింగ్‌ని చూసేందుకు.. భార్య ప్రియా సింగ్‌ ఉత్తర ప్రదేశ్‌ నుంచి షార్‌కు వచ్చారు.

విగతజీవిగా పడిఉన్న భర్తను చూసి మనస్తాపంతో షార్‌లోని నర్మదా అతిథి గృహంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వికాస్‌సింగ్‌ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి, తండ్రి ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. కాగా నిన్న షార్‌ మొదటిగేటు వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వికాస్‌సింగ్‌ (33) సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకు­న్నారు. బిహార్‌కు చెందిన వికాస్‌సింగ్‌ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారని, అందుకు పైఅధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు.

సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఆత్మహత్యల కలకలం.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది సూసైడ్

ఈ ఘటన మరువక ముందే షార్‌లోని జీరోపాయింట్‌ రాడార్‌ సెంటర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలో ఆది­వారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్‌ చింతామణి (29) ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మహషముండ్‌ జిల్లా శంకర విలేజ్‌ అండ్‌ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.

ఎస్సై, జవాను ఆత్మహత్యలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కుటుంబ బాధలు, వ్యక్తిగత ఇబ్బందులే ఆత్మహత్యలకి కారణంగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. విచారణ ఇంకా కొనసాగుతోంది. సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తైంది. కుటుంబ సభ్యులకి అప్పగించారు.