CM Jagan Meeting: ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు, నేతలు విబేధాలు వీడాలని సీఎం జగన్ ఆదేశాలు, 2024లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు
CM-YS-jagan-Review-Meeting

Amaravati, April 27: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశం (CM Jagan Meeting) జరిగింది. ఈ సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, మంత్రులు హాజరయ్యారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై సీఎం జగన్‌ (Andhra Pradesh CM Jagan Mohan Reddy) దిశా నిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఎల్లో మీడియాతోనూ చేస్తున్నామని సీఎం అన్నారు. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు.

సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. జులై 8న ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ఈలోగా కొన్ని కార్యక్రమాలు చేయాలి. జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. కమిటీల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు చోటు కల్పించాలని’’ సీఎం అన్నారు. ‘‘కలిసికట్టుగా పనిచేయాలి, ఎలాంటి విభేదాలున్నా పక్కనబెట్టాలి. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నాం, వారికి కేబినెట్‌ హోదా ఇస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయి. మే నెల నుంచి పూర్తిగా గేర్‌ మారుస్తున్నాం.. అందరూ సన్నద్ధం కావాలి’’ అని సీఎం జగన్‌ అన్నారు.

జూన్ తర్వాత కరోనా ఫోర్త్ వేవ్ కల్లోలం, అక్టోబరు వరకు దాని ప్రభావం, కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్, మాస్కులు ధరించాలని సూచన

సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రులు, పార్టీ అధ్యక్షులతో జరిగిన సమావేశం (YSRCP meeting with party Leaders) అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల నుంచి సచివాలయాలను ఎమ్మెల్యేలు తప్పక సందర్శించాలని సీఎం ఆదేశించారన్నారు. విభేదాలు విడనాడి అందరూ కలసి పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా కష్టపడి పనిచేయాలని సీఎం చెప్పారన్నారు.

ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించి సమస్యలను అక్కడి బుక్ లో రాయాలని ఆదేశించారు. సచివాలయంలో రాసిన సమస్యలను తాను తీసుకుని పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. జూలై 8న ప్లీనరీ నిర్వహణపైనా చర్చ జరిగింది. పార్టీకి వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సీఎం ఆదేశించారు. అభివృద్ది సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. సీఎం త్వరలో జిల్లాల పర్యటనలకు వస్తారు. విభేదాలు, సమస్యలను వెంటనే పరిష్కరించాలని రీజినల్ కో-ఆర్డినేటర్లను ఆదేశించారు.

దేశంలో కొత్తగా 2927 మందికి కరోనా, త 24 గంటల్లో 2252 మంది కోలుకోగా, 32 మంది మృతి, రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పెరిగిందని తెలిపిన ఆరోగ్యశాఖ

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సర్వేలు చేయించుకున్నారు. 65 శాతం ప్రజలు సీఎం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని సర్వేల్లో తేలింది. సర్వేల్లో కొంత మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గింది. కొందరు ఎమ్మెల్యేల గ్రాప్ 50 నుంచి 40 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఆదేశించారు. గ్రాప్ పెంచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చుతామని సీఎం చెప్పారు. సీఎం ఇచ్చిన మరో అవకాశాన్ని ఎమ్మెల్యేలు అందరూ వినియోగించుకోవాలని’’ కొడాలి నాని అన్నారు.

సమావేశం అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం కార్యాచరణ నిర్దేశించారు. ఎన్నికలకు ముందు ఓ ఆలోచనా విధానంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలు వారంలో 2,3 రోజులు ప్రజల్లో ఉండాలి. ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలి. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తాం. ఉద్యోగులపై ప్రభుత్వం పాజిటివ్‌గా ఉంది. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వం బాధ్యత' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.