Andhra Pradesh CM YS Jagan Mohan Reddy Meets PM Narendra Modi. (Photo Credits: Twitter@PMOIndia)

Delhi, July 5: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై మోదీతో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధాని మోదీతో జగన్ దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు.రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో సీఎం జగన్‌ చర్చించినట్లు సమాచారం.

అంతకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించినట్లు సమాచారం. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌ నిధులపై కూడా అమిత్‌ షాతో సీఎం జగన్‌ చర్చించారని తెలుస్తోంది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే?

అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహాయం, పోలవరం నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.