YSRCP Plenary: మేనిఫెస్టోలో 95శాతం హామీలు నెరవేర్చాం! మా మేనిఫెస్టో చూసేందుకే టీడీపీకి వణుకుపుడుతోంది, వైయస్సార్‌సీపీ 13 ఏళ్ల ప్రస్థానంపై సీఎం జగన్ పవర్‌ఫుల్ స్పీచ్

Guntur, July 09: వైయస్సార్ కాంగ్రెస్ ప్లీనరీలో (YSRCP Plenary) కార్యకర్తలకు జోష్ ఇచ్చేలా ప్రసంగించారు పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan). 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతంమేర పూర్తి చేసినట్లు చెప్పారు. ఏ ప్రభుత్వానికి సాధ్యంకాని పథకాలను తాము తీసుకువచ్చినట్లు చెప్పారు. మేనిఫెస్టోల్లో (Manifesto) హామీలు ఇచ్చి మాయలు చేసే పార్టీలను చూశాం, కానీఈ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు తాము ప్రతిక్షణం తపనపడ్డామన్నారు సీఎం జగన్. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రజలు నిలదీస్తారని టీడీపీ(TDP) మేనిఫెస్టోను మాయం చేసిన సంగతి అందరికీ తెలుసు. కానీ తాము మాత్రం మేనిఫెస్టోలో పెట్టిన 95 శాతం అంశాలను నెరవేర్చినట్లు చెప్పారు సీఎం జగన్. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను చూడటానికే టీడీపీ భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైఎస్సార్‌సీపీ అని గర్వంగా చెప్తున్నామన్నారు సీఎం జగన్.

ఇక వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan) ప్రారంభోపన్యాసం చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 2009, సెప్టెంబర్‌ 25న పావురాలగుట్టలో సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపం దాల్చింది. వైఎస్సార్‌ (YSR) ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించింది. నన్ను ప్రేమించి, నాతో వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా‌. ఈ 13ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. నాన్న నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం నా చేయి ఎప్పుడూ వదల్లేదు. ప్రజలు మూడేళ్ల కిందట కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. నాకు ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడు నా చేయి వీడలేదు. మన పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది. కాబట్టి గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు అని సీఎం జగన్‌ అన్నారు.

YSRCP Plenary 2022: నాకు మీ చల్లని దీవెనలు చాలు, మళ్లీ అధికారంలోకి వస్తాం, ప్లీనరీ వేదికగా ప్రతి పక్షాలపై మండి పడిన సీఎం జగన్, సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే.. 

దుష్టచతుష్ట​యం మన పాలనలో మంచి ని ఓర్వలేక అబద్దాల విషప్రచారం చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇవాళ నోరు పారేసుకుంటున్నారు. ఆ కట్టుకథల్ని, వాటికి అబద్ధాలు జోడించి ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. గతంలో రాష్ట్రాన్ని దోచుకో పంచుకో అన్నట్లుగా గజదొంగల ముఠా వ్యవహరించింది. ఇప్పుడు అవకాశం లేక కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ జనం వెంట, జనం గుండెల్లో ఉంది. గజదొంగల ముఠా మాత్రం, ఎల్లో మీడియా, ఎల్లో సోషల్‌ మీడియాలో మాత్రమే ఉంది. వాళ్లకు, మనకు ఎక్కడా పోలిక లేదు. మనది చేతల పాలన.. వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని సీఎం జగన్‌ అన్నారు.