Andhra Pradesh CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, May 19: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 లాక్‌డౌన్‌ (Covid-19 Lockdown) కారణంగా మూత పడిన స్కూళ్లు ఆగస్టు 3 నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ (AP CM YS jagan) ప్రకటించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు (nadu nedu scheme) కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. విద్యావ్యవస్థలో నూతన మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందని, కలెకర్ట్‌లు అందరూ సమష్టిగా పని చేయాలని సూచించారు. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఫేక్ పోస్టులు, 60 ఏళ్ల బామ్మపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు, నేరం రుజువైతే మూడేళ్ళు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం

ఈ నేపథ్యంలోనే ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్ట్‌ 3న రాష్ట్రంలోని పాఠశాలన్నీ ప్రారంభించాలని (Schools Reopen in AP) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశామని తెలిపారు. ఏపీలో బస్సు సర్వీసులపై తాజా మార్గదర్శకాలు, వలస కార్మికుల తరలింపు తరువాతే బస్సులు ప్రారంభం, లాక్‌డౌన్ సడలింపులపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం

జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి చేసే విధంగా ఆయా జాల్లా కలెక్టర్లు పనులపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి సూచించారు. మరోవైపు పాఠశాలల అభివృధి పనుల కోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

పనులకోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే సెప్టెంబర్‌ 25న వైఎస్సాఆర్ విద్యా దీవెన, ఆగస్టు19న వైఎస్సార్‌ వసతి దీవెన పథకం కింద నిధులు జమ చేయనున్నట్లు కూడా తెలిపారు.