Vjy, Feb 20: సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ ముందుకు వెళుతున్న ఏపీ సర్కారు నేడు వైఎస్సార్ కల్యాణమస్తు (YSR Kalyanamasthu), వైఎస్సార్ షాదీ తోఫా సాయానికి సంబంధించిన 5వ విడత నిధులను విడుదల చేసింది. మంగళవారం వైఎస్సార్ కల్యాణమస్తు.. వైఎస్సార్ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో సీఎం (CM YS Jagan Mohan Reddy) జమ చేశారు. పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని.. అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని (YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa) అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు.
ఇవాళ అర్హులైన 10,132 జంటలకు రూ. 78.53 కోట్ల సాయం అందిస్తున్నాం. వధూవరులకు పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా చేశాం. వధువు కనీస వయసు 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్లుగా నిర్దేశించాం. వయసు పరిమితి పెట్టడం వల్లే బాల్యవివాహాలు తగ్గాయి. దీంతో పేద పిల్లల చదువుల్ని ప్రొత్సహించినట్లు అవుతుంది. ఏ త్రైమాసికంలో వివాహం జరిగితే.. ఆ త్రైమాసికం పూర్తైన వెంటనే సాయం అందిస్తున్నాం అని సీఎం జగన్ అన్నారు. ఇప్పటివరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.427.27 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. జనసేన పార్టీని కుక్కతో పోల్చిన కేఏ పాల్, ఎవడికి కావలిరా నీ అపాయింట్మెంట్ అంటూ నారా లోకేష్ మీద ఫైర్, విశాఖ నుంచి ఎంపీగా పోటీలో ఉంటానని వెల్లడి
మొత్తం 5 విడతల నిధులు వివరాలు ఇలా..
తొలి దఫా.. జమ చేసిన తేదీ (10.02.2023) లబ్ధిదారులు 4,536, అందించిన మొత్తం రూ. కోట్లలో 38.18 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్ – డిసెంబర్ 2022)
రెండో దఫా.. జమ చేసిన తేదీ (05.05.2023) లబ్ధిదారులు 12,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 87.32 (వివాహం జరిగిన త్రైమాసికం జనవరి-మార్చి 2023)
మూడో దఫా.. జమ చేసిన తేదీ (09.08.2023) లబ్ధిదారులు 18,883, అందించిన మొత్తం రూ. కోట్లలో 141.60 (వివాహం జరిగిన త్రైమాసికం ఏప్రిల్-జూన్ 2023)
నాలుగో దఫా.. జమ చేసిన తేదీ (23.11.2023) లబ్ధిదారులు 10,511, అందించిన మొత్తం రూ. కోట్లలో 81.64 (వివాహం జరిగిన త్రైమాసికం జులై-సెప్టెంబర్ 2023)
ఐదో దఫా.. జమ చేసిన తేదీ (20.02.2024) లబ్ధిదారులు 10,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 78.53 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్ 2023)
మొత్తం లబ్ధిదారులు 56,194 అందించిన మొత్తం రూ. కోట్లలో 427.27