Ys Jagan (Photo/Twitter/APCMO)

Amaravati, Feb 14: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh Govt)మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 ​టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను (26 police stations) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మంగళవారం ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు మీ స్నేహితులే అనే భావనను తీసుకురాగలిగామని, ఇంతకుముందు జరగని రీతిలో పోలీస్‌ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. పోలీస్‌ స్టేషన్లలో రిసెష్పనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామని అన్నారు.

ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించిన ఆస్ట్రేలియా లేబర్ పార్టీ ఎంపీల బృందం.. సీఎం జగన్ తో భేటీ

పర్యాటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభించినట్లు తెలిపారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్‌ స్టేషన్లు ఉపయోగపడతాయని అన్నారు.