Amaravati, Dec 30: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.986 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మీ' ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.
గతంలో ఈ ప్రాంతాన్ని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. మన ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నాం. వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాం. విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ రాబోతుంది. కొత్త మెడికల్ కాలేజ్ కారణంగా 150 మెడికల్ సీట్లు వస్తాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుంది' అని సీఎం జగన్ చెప్పారు.
ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తున్నాం. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోంది. ఎల్లోమీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుంది. అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు' అని సీఎం జగన్ మండిపడ్డారు.
రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోంది. ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుంది. దుష్టచతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, పవన్. అవ్వాతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. పెన్షన్లపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. నిబంధనల ప్రకారం ప్రతీ ఆరు నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ చేయాలి. పెన్షన్ వెరిఫికేషన్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారు’’ అని సీఎం మండిపడ్డారు.
సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రాలో పలు నగరాలకు రాకపోకలు
చంద్రబాబు పాలనలో ఒక్క మంచి పనైనా జరిగిందా?. దత్తతండ్రిని దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. వారికి ఈ రాష్ట్రం కాకుంటే.. మరో రాష్ట్రం.. ఈ ప్రజలు కాకుంటే.. మరో ప్రజలు.. ఈ భార్య కాకుంటే మరో భార్య అన్నదే వారి తీరు. రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తనవల్లేనని చంద్రబాబు చెప్పుకుంటారు. సింధుకు బ్యాడ్మింటన్ తానే నేర్పానని చెప్పుకుంటారు. తన ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ కూడా పెట్టలేకపోయారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేవి వెన్నుపోటు, మోసాలు. అన్ని వర్గాలను మోసం చేసిన బాబును ప్రజలు ఎందుకు నమ్ముతారు’’ అని సీఎం అన్నారు.
‘‘ప్రతి వర్గాన్ని కూడా వంచించిన బాబు సభకు జనం ఎందుకొస్తారు?. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసినందుకా.. జనం వచ్చేది. రుణాలు పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారు. మన రాష్ట్రానికి రావాల్సిన హోదాను ప్యాకేజీ కోసం తాకట్టుపెట్టినందుకా? ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేసినందుకా?. అందరినీ మోసం చేశాక.. చంద్రబాబు సభకు ఎవరైనా వస్తారా?. బాబు సభకు జనాన్ని తీసుకురావడానికి నానా కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు పాపంలో దత్తపుత్రుడు పవన్‌కు కూడా వాటా ఉంది’’ అని సీఎం ధ్వజమెత్తారు.
‘‘ఫోటో షూట్, డ్రోన్ షాట్స్ కోసం జనం రాకపోయినా జనం బాగా వచ్చారని చూపించేందుకు యత్నించారు. ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టి 8 మందిని చంపేశారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో కూడా చంద్రబాబు తన షూటింగ్ కోసం 29 మందిని బలిగొన్నారు. రాజకీయాలు అంటే షూటింగ్‌లు కాదు. రాజకీయం అంటే డైలాగులు కాదు, డ్రోన్ షాట్‌లు, డ్రామాలు కాదు. రాజకీయం అంటే రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుపేద, మధ్య తరగతి కుటుంబంలో మార్పులు తీసుకురావాలి’’ అని సీఎం పేర్కొన్నారు.
రాజకీయం అంటే ప్రభుత్వ ఆసుపత్రులను మార్చగలగాలి, గ్రామాల రూపురేఖలు మార్చాలి, ఇళ్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించి వారి గుండెల్లో చోటు కల్పించుకోవడం అని సీఎం చెప్పారు. ‘‘రాజకీయం నాయకుడంటే ప్రజలకు సేవకుడు. చంద్రబాబు మాదిరి ప్రజలపై అధికారం చెలాయించడం కాదు. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న వ్యక్తి చంద్రబాబు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు. రాజకీయాలు అంటే సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు అందరు కూడా ప్రజల సేవకులన్నది రాజకీయం’’ అన్ని సీఎం జగన్ అన్నారు.