CM YS Jagan Meets PM Modi (Photo-ANI)

Amaravati, Jan 3: భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ (CM YS Jagan Meets PM Modi:) ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రధానితో గంట పాటు సమావేశం సాగింది. సీఎం జగన్‌ (Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy) వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మిథున్‌రెడ్డి ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బతీసిందని సీఎం జగన్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు.

విభజన సమయంలో 58 శాతం, జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం మాత్రమే రెవెన్యూ దక్కిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఈ గణాంకాలే నిదర్శనమని ప్రధానితో సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్ర విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయింది. తెలంగాణలో ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలనూ కోల్పోయాం. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి. ప్రత్యేక హోదాతో పాటు అనేక హామీలు ఇచ్చారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుంది. 2013 భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు గణనీయంగా పెరిగింది. ఏప్రిల్‌ 1, 2014 అంచనాల మేరకే పోలవరం నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్ట్‌ వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదని’’ ప్రధానికి సీఎం వివరించారు.

ఏపీలో గత 24 గంటల్లో 122 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 41 మందికి కరోనా నిర్ధారణ

‘‘ప్రాజెక్ట్‌ అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్‌ 90లో పేర్కొన్న స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ప్రాజెక్ట్‌ ఆలస్యమైతే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని నిర్ణయించాలి. పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి. పోలవరం నిర్మాణంపై రూ.2,100 కోట్ల పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ లోటును పూడుస్తామంటూ అప్పటి ప్రధాని ప్రకటన చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.18,830.87 కోట్లు చెల్లించాలని’’ సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్‌ సమావేశం అయ్యారు. రాత్రి 8 గంటలకు విమానయాన మంత్రి సింథియాను సీఎం కలవనున్నారు. రేపు (మంగళవారం) ఉదయం 9.30కు కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు.