AP CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, Feb 15: గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం మంగళవారం ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేశారు. వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నల ఖాతాలో మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని (Rs 534-crore crop loss subsidy to farmers ) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy ) మంగళవారం నేరుగా జమ చేశారు.

అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేశారు.ఇలా మొత్తం రూ.571.57 కోట్లను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan Mohan Reddy) బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ అక్షరాల రూ.1,612.62 కోట్లు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, శంకరనారాయణ, ఏపీ అగ్రికల్చర్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఏపీ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్‌ రెడ్డి, గౌతమ్ సవాంగ్‌పై బదిలీవేటు, గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం. రాయలసీమలో గ్రౌండ్‌ వాటర్‌ పెరిగింది. ఏపీలో అన్ని ప్రాంతాలు జలాశయాలతో కళకళ లాడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయారు. అధిక వర్షాలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తున్నాం. నేలకోత, ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికీ సాయం అందిస్తున్నాం.

శాస్త్రీయంగా అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ క్రాఫ్ట్‌ డేటాను ఆర్‌బీకే స్థాయిలో ప్రవేశపెట్టాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. గ్రామీణ స్థాయిల్లో ఆర్‌బీకే కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితా డిస్‌ప్లే చేస్తున్నాం. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1612 కోట్ల సాయం అందించాం. 18.70 లక్షల మంది రైతులకు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం' అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.