Kasi Reddy V.R.N Reddy: ఏపీ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్‌ రెడ్డి, గౌతమ్ సవాంగ్‌పై బదిలీవేటు, గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి
Kasereddy Rajendranath Reddy and sawang

Amaravati, Feb 15: ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా పనిచేస్తున్నారు. గతంలో విజయవాడ, విశాఖ, పోలీస్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేశారు. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. సర్వీస్‌లో జాతీయస్థాయిలో రాజేంద్రనాథ్‌రెడ్డి (Kasireddy Rajendranath Reddy) గుర్తింపు పొందారు.

ఇప్పటివరకు ఉన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ పై (Sawang) బదిలీవేటు పడింది. గౌతమ్ సవాంగ్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా పని చేశారు. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు ముందున్నప్పటికీ రాజేంద్రనాథ్ ను డీజీపీగా నియమించడం గమనార్హం. రాజేంద్రనాథ్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అయితే గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం ఇంతవరకు కొత్త పోస్టింగ్ ఇవ్వలేదు. ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే, రాష్ట్ర చరిత్రలో రోడ్లకు ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదని తెలిపిన ఏపీ సీఎం జగన్, విశాఖ బీచ్‌ కారిడార్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైదిగా నిలిచేలా ప్లాన్ రూపకల్పన

ఇక పీఆర్సీపై అసహనంతో ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమయిందని, ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.