CM-YS-jagan-Review-Meeting

Amaravati, May 6: వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష (CM Jagan Review) నిర్వహించారు. రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత, కిసాన్‌ డ్రోన్లు, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష (CM YS Jagan review meeting) జరిపారు.

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పుడ్‌ ప్రాససింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసుదన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మే 16న రైతు భరోసా, జూన్‌ 15 లోగా రైతులకు పంట బీమా పరిహారం. అదే నెలలో 3వేల ట్రాక్టర్లు సహా, 4014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు ప్రభుత్వం ఇస్తోంది.

 రైతులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, 15న అకౌంట్లలో రైతు భరోసా మొదటి విడత నిధులు, అర్హులైన భూ యజమానులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం

రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏఓ చాంఫియన్‌ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులను సీఎం అభినందించారు. తోట బడి కార్యక్రమంలో మామిడి, అరటిపై కరదీపికను సీఎం విడుదల చేశారు. బ్యాంబు ట్రీ (వెదురు) బై ప్రొడక్ట్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రైతుల చేతిలో పెట్టబడులు పెట్టేలా కార్యాచరణ ఉండాలని సీఎం తెలిపారు. అలాగే మే 11న మత్స్యకార భరోసా అందించనున్నట్లు సీఎం తెలిపారు.