Amaravati, August 12: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష (CM YS Jagan Review Meeting) చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి (Review Meeting on Education Department) విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. స్కూళ్లకు ఎలాంటి మరమ్మత్తు వచ్చినా వెంటనే బాగు చేసే విధానం ఉండాలన్నారు. అదే సమయంలో అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ (CM YS Jagan) స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరినాటికే సిద్ధం చేయాలన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని, దశలవారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు.
నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండాలి, దీనికోసం ఎస్‌ఓపీలను రూపొందించాలని సీఎం సూచించారు. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు నిర్వహించేలా విధానం ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే అన్నిరకాలుగా సిద్ధంకావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ నాటికే విద్యా కానుక కింద అందించే వాటిని సిద్ధంచేసుకోవాలన్న సీఎం, సమావేశంలో పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్ నాణ్యతను పరిశీలించారు.