Vjy, Nov 14: తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఆదాయార్జన శాఖలపై (revenue-earning-departments) సమీక్ష నిర్వహించారు. విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
పన్ను చెల్లింపుదారులకు అధికారులు మరింత అవగాహన కల్పించాలని, చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని సీఎం సూచించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నియంత్రణ చర్యల వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గింది. అక్రమ మద్యం తయారీపై ఎస్‌ఈబీ(స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని సీఎం అన్నారు.
శాశ్వత భూహక్కు, భూ సర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాల్లో.. వార్డుల్లో...సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్ అందించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో.. ఏఏ రకాల డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న విషయాలపై ప్రజలకూ అర్ధమయ్యేలా వివరించాలని సీఎం సూచించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాను అప్‌గ్రేడ్ చేయాలని సీఎం ఆదేశించారు.నాన్ ఆపరేషనల్ మైన్స్‌పై మరింత దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సీఎం జగన్ అన్నారు.