CM YS Jagan solves a mother’s problem within 2 hours: Mentally retarded boy to get pension (Photo-CMOAP/Twitter)

Tuni, Augutst 5: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పాయకరావుపేటలో పర్యటించిన సందర్భంలో ఓ తల్లి కష్టం చూసి చలించిపోయిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.శరీర వైకల్యంతో బాధపడుతున్న తన బిడ్డకు సాయం (Mentally retarded boy to get pension) అందించాలని ఓ తల్లి ఆయన్ని దీనంగా వేడుకుంది. స్పందించిన సీఎం జగన్‌.. తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, అలాగే పింఛను మంజూరు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను అక్కడిక్కడే ఆదేశించారు‌.

ఆయన సూచనల మేరకు అంతే త్వరగతిన అధికారులు స్పందించారు. రెండు గంటలలోపే జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.. తల్లి తనూజ, చిన్నారి ధర్మతేజలను కాకినాడ కలెక్టరేటుకు రావలసినగా సూచించారు. డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణి తో ఆ తల్లీ కొడుకుల రాకకోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబరుకు పిలిపించుకుని రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం (CM YS Jagan solves a mother’s problem) ఆ తల్లికి అందించారు. అలాగే చిన్నారి ధర్మతేజకు వచ్చే నెల నుండి పింఛను మంజూరు చేస్తున్నట్లు భరోసా ఇచ్చారు. చిన్నారికి పూర్తిస్థాయి వైకల్యం ఉండడంతో.. రూ. 35 వేల విలువైన వీల్ చైర్ అందించారు.

కాన్వాయ్ ఆపి మానవత్వం చాటుకున్న సీఎం జగన్, అనారోగ్యంతో బాధపడుతున్న బాబుకు సత్వర సాయం అందించాలని ఆదేశాలు

అసలేం జరిగిందంటే...

కాకినాడ జిల్లా శంఖవరం మండలం, మండపం గ్రామానికి చెందిన నక్కా తనూజకు వైకల్యంతో బాధపడుతున్న కొడుకు ఉన్నాడు. పూర్తిగా బిడ్డ ఆలనాపాలనా చూస్కోవాల్సి రావడంతో.. తనూజ కూలీ పనులకు వెళ్లలేక ఆర్థికంగా ఇబ్బందిపడింది. అధికారులకు అర్జీ పెట్టుకుంది. ఈలోపు తన నిస్సహాయ స్థితిని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు చిన్నారితో సహా ఎదురుచూసింది. గురువారం పాయకరావు పేటలో సీఎం జగన్‌ ఓ వివాహ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసి.. ఆ కళ్యాణ మండపం దగ్గరకు చేరుకుని.. జనం మద్యలో నిలుచుంది. ఇంతలో అక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్‌ నుంచే తనూజను చూశాడు. కాన్వాయ్‌ను ఆపించి.. ఆమెను దగ్గరకు పిలిచి కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వెంటనే సీఎం తక్షణ సాయం అందించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. జగన్ చూపిన చొరవకు ఆ తల్లి పదే పదే కన్నీళ్లతో కృతజ్ఞతలు చెబుతోంది.