Amma Vodi: నేడు అమ్మఒడి నిధులు విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం, 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్ల రూపాయలు జమ
AP CM YS Jagan (Photo-Twitter)

Amaravati, June 27: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమం ద్వారా జగనన్న అమ్మ ఒడి పథకం కింద మూడో ఏడాది ఆర్ధిక సాయాన్నిఅందించనున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి ఈ పథకం కింద… ఒకటి నుండి ఇంటర్‌ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్ల రూపాయలను నేడు తల్లుల అకౌంట్లలో జమ (CM YS Jagan to disburse Amma Vodi) చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,595 కోట్లతో కలిపి ఇప్పటివరకు అమ్మ ఒడి పథకం (Amma Vodi) క్రింద ప్రభుత్వం అందించిన మొత్తం 19,618 కోట్ల రూపాయలు.

2019 – 20 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది తల్లులకు రూ. 6,349.53 కోట్లు

2020 – 21 విద్యా సంవత్సరంలో 44,48,865 మంది తల్లులకు రూ. 6,673.00 కోట్లు

2021 – 22 విద్యా సంవత్సరంలో 43,96,402 మంది తల్లులకు. 6,595.00 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది.

అమ్మ ఒడి పథకంలో కోతలు విధిస్తున్నారన్న విపక్షాల విమర్శలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను బడికి పంపలేని దుస్ధితి రాకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే మంచి ఉద్దేశ్యంతో అమ్మ ఒడి పథకానికి కనీసం 75 శాతం అటెండెన్స్‌ ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. 2019లో పథకం ప్రవేశపెట్టినప్పుడే ఆ జీవో లోనే నిబంధనలు ఉన్నాయి. పథకం ప్రవేశపెట్టిన తొలి ఏడాది కావడంతో 2019 – 20 లో, కరోనా కారణంగా 2020 – 21 విద్యా సంవత్సరాలకు ఈ అటెండెన్స్‌ నిబంధన నుంచి సడలింపు ఇచ్చినట్లు తెలిపింది.

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతాల పెంపు, జీవో విడుదల చేసిన జగన్ సర్కారు..

గత సెప్టెంబర్‌ నుంచి విద్యా సంస్ధలు యధావిధిగా పనిచేస్తున్నందున స్కూల్స్‌ నడిచిన రోజుల్లో 75 శాతం హాజరు నిబంధన తిరిగి అమలుచేయడంతో 2021 –22 లో 51,000 మంది అమ్మ ఒడి లబ్ధిని అందుకోలేక పోయారు. ఈ విషయం బాధాకరమైనప్పటికీ భవిష్యత్‌లో ఇలాంటి పరిస్ధితి రాకుండా పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి, కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులే బాధ్యత తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వం అమలుచేస్తున్న జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు – నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన – సీబీఎస్‌ఈతో, బైజూస్‌ ఒప్పందంతో నాణ్యమైన విద్య వంటి మంచి కార్యక్రమాల లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని, పిల్లలకు పూర్తి లబ్ధి చేకూరుతుందని, మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలిగే పరిస్ధితి వస్తుందని మనస్పూర్తిగా విశ్వసిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

అమ్మ ఒడి నిధుల నుండి నాడు నేడులో అభివృద్ది చెందిన స్కూళ్ళ బాగు కోసం స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (ఎస్‌ఎంఎఫ్‌) కు రూ. 1,000, టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (టీఎంఎఫ్‌) కు రూ. 1,000 జమ చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. నిర్వహణలో ఏవైనా లోపాలుంటే హక్కుగా అడిగే పరిస్ధితులను తల్లులకు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీతనం పెరిగేలా పాఠశాల మెయింటెనెన్స్‌ ఫండ్, టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ ల నిర్వహణ బాధ్యత కూడా హెడ్‌మాస్టర్లు, పేరెంట్స్‌ కమిటీలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది.