AP CM YS Jagan (Photo-Twitter)

Vizag, July 15: రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకాన్ని (YSR Vahana Mitra 2022) రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా అందించనుంది. ఇందులో భాగంగా సీఎం జగన్ విశాఖ నుంచి వైఎస్సార్‌ వాహన మిత్ర నిధులు విడుదల చేయనున్నారు. 2022–23కుగాను ఈ పథకం కింద 2,61,516 మంది అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్‌ డ్రైవర్లకు ఈ ప్రయోజనం కల్పించనుంది. ఒక్కో లబ్దిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు.

దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం (YSR Vahana Mitra ) ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేసినట్లవుతుంది.గత మూడేళ్ల కంటే ఈ ఏడాది మరింత ఎక్కువమంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని ప్రభుత్వం అందించనుండటం విశేషం.

ఏపీలో గోదావరి వరదలు, రంగంలోకి దిగిన రెండు నేవీ హెలికాఫ్టర్లు, వరద బాధితులకు పైనుంచి ఆహార సామాగ్రిని జారవిడిచిన UH3H హెలికాప్టర్లు

లబ్ధిదారుల్లో అత్యధికులు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఉండటం గమనార్హం. వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమం అనంతరం సీఎం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకోనున్నారు. అక్కడి నుంచి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు అనంతరం రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులతో వరదపై సమీక్షించనున్నారు.