Vjy, May 31: పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అన్నారు. విజయవాడలో ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘‘రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నా.
నాకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు. ఇవాళ నా పదవీ విరమణ రోజు.. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నానని అన్నారు. ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్, ప్రింటింగ్, స్టేషనరీ మరియు స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు
ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ కమిషనర్ ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం విజయవాడలోని కార్యాలయంలో ఏబీవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇవాళే ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యావాదలు. యూనిఫాంతో పదవీ విరమణ చేయడం నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నా’’ అని ఏబీవీ తెలిపారు.