ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఏపీ నూతన డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం బదిలీ వేటు వేసిన సంగతి విదితమే.
తక్షణమే ఆయనను బదిలీ చేయాలని ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీచేసింది. సోమవారం ఉదయం 11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. వారిలో నుంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అయిన బాగ్చికి తాత్కాలికంగా ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామం, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం
ద్వారాకా తిరుమలరావు కొత్త డీజీపీగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం సీనియారిటీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.ఆయన తర్వాత స్థానాల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా, 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు