Andhra Pradesh Elections 2024: ఏపీలో అనర్హులుగా 5 లక్షల 64వేలకు పైగా ఓటర్ల పేర్లు, దొంగ ఓటర్లను చేర్చుతున్న 13 మందిపై కేసు నమోదు చేశామని తెలిపిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా
AP CEO Mukesh Kumar Meena (Photo-Video Grab)

Vjy, Jan 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ (Andhra Pradesh Elections 2024) రానున్న నేపథ్యంలో, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఓట్ల నమోదుకు సంబంధించి డిసెంబరు 9 వరకు వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని ఆయన (AP CEO Mukesh Kumar Meena) చెప్పారు. డిసెంబరు 9 తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12 లోగా పరిష్కరిస్తామని తెలిపారు.గందరగోళం లేకుండా ఓటరు జాబితాను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు.

విజయవాడలో టీడీపీకీ మరో షాక్, కార్పొరేటర్ పదవికి, టీడీపీకి గుడ్‌బై చెప్పిన కేశినేని శ్వేత

మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించాం. రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో, 14.48 లక్షల పేర్లను పరిశీలించి... 5,64,819 పేర్లను (5.64 lakh names found ineligible) అనర్హులుగా గుర్తించామని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఓటర్ల జాబితా నుంచి అనర్హులను కలెక్టర్లు తొలగించారని స్పష్టం చేశారు. కాకినాడలో ఒకేసారి పెద్దమొత్తంలో ఓటర్లను చేర్చుతున్న 13 మందిపై కేసు నమోదు చేశామని మీనా తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వివరించారు.

అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ AP ప్రభుత్వ ఆదేశాలు జారీ.. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు..

చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశామని, 24 మంది బీఎల్వోలపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పర్చూరులో 10 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటికే పర్చూరు ఈఆర్ఓ, సీఐ, ఎస్ఐ సస్పెండ్ అయ్యారని వెల్లడించారు. ఉరవకొండ, ప్రొద్దుటూరు ఈఆర్ఓలు సస్పెండ్ అయ్యారని వివరించారు. ఈసీ క్రమశిక్షణ చర్యలకు గురైన వారు ఎన్నికల్లో విధుల్లో ఉండరని మీనా స్పష్టం చేశారు.

ఇప్పటివరకు 50 మంది బీఎల్వోలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.జీరో డోర్ నంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితాను సవరించాం. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలు విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదయ్యాయి’’ అని ముకేశ్‌కుమార్‌ మీనా వివరించారు.