రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో జైత్రయాత్రకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన, ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్రలను జగన్ నిర్వహించిన సంగతి విదితమే. 22 రోజుల్లో 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు.. 2,188 కి.మీలు.. 9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు.. జన ప్రభంజనం మధ్య జైత్ర యాత్రలా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగింది.
మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్
►28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు
►29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు
►30న కొండెపి, మైదుకూరు, పీలేరు
►మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు