Dadi Veerabhadra Rao (photo-X)

వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి దాడి పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy)రాజీనామా లేఖను పంపించారు.వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్‌, జైవీర్‌ కూడా పార్టీకి రాజీనామా చేశారు

రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని.. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెబుతామని దాడి వీరభద్రరావు ప్రకటించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దాడి వీరభద్రరావు.. తెలుగుదేశం తరపున అనకాపల్లి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

అనకాపల్లిలో వైసీపీకి షాక్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా, త్వరలో రాజకీయ భవిష్యత్ ప్రకటన

కాగా 2013లో దాడి వీరభద్రరావు టీడీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. అనకాపల్లి టికెట్‌ ఆశించి వైసీపీలో చేరినప్పటికీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే త్వరలో ఆయన జనసేన-టీడీపీ అలయన్స్ జట్టుకడితే అందులోకి వెళతారని సమాచారం. దీనిపై అయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది.