ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. 2019లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశాడు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ 70 వేలకు పైగా కాపు ఓట్లు ఉన్నాయి. అయినా పవన్‌ను చిత్తుగా ఓడిపోయారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో లెక్కలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
పిఠాపురంలో మొత్తం ఓటర్లు 2.28 లక్షలు ఉన్నారు. ఇందులో 91 వేల మంది కాపు ఓటర్లున్నారు. 2004లో పెండెం దొరబాబు బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొప్పన వెంకట చంద్ర మోహనరావు మీద 17,899 ఓట్ల మెజారీటీతో గెలిచారు.ఇక 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోగా... 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేసి 14 వేల 900 పై చిలుకు మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి SVSN వర్మ 47,080 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆయన 2014లో ఇండిపెండెంట్ గెలిచారు. 2019లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు టీడీపీలోనే కొనసాగుతున్నారు. పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్, అధికారికంగా ప్రకటించిన జనసేన అధినేత
ఇక ఈ నియోజకవర్గంలో 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి గెలిచారు వంగా గీతా విశ్వనాథ్. అనంతరం ఆమె వైసీపీలో చేరి కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆమెకు పిఠాపురం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. ఇక ఇక్కడ నుంచి బలంగా వినిపిస్తున్న మరో పేరు ముద్రగడ పద్మనాభం. ఆయన రేపోమాపో వైసీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంటాకు రెండో జాబితాలో దక్కని చోటు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ, 34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో జీబితా విడుదల
ఇప్పటికే కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మర్యాద పూర్వకంగా కలిసారు. పిఠాపురం నియోజవర్గం అభివృద్ధి, పలు అంశాలపై మాట్లాడుకున్నారు.పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో వైసీపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం ఉంది.