YS Sharmila Slams CM Jagan: ఇప్పుడున్న జగన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, రోజుకొక దొంగతో నన్ను తిట్టిస్తున్నారని మండిపాటు
Sharmila Slams CM Jagan (photo-Facebook)

Vjy, Jan 29: నా అన్న జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే.. ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తనకు ఎప్పుడూ పదవీ కాంక్ష లేదని, ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు.

సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షి మీడియాలో జగన్ తో సమానంగా తనకు కూడా భాగస్వామ్యం ఉందని ఆమె చెప్పారు. తన తండ్రి వైఎస్సార్ సాక్షిలో జగన్ కు, తనకు సమానంగా వాటా ఉండాలని భావించారని అన్నారు.

వీడియో ఇదిగో, దమ్ముంటే నాపై పోటీ చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరిన కేశినేని నాని, 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా

ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదని షర్మిల అన్నారు. గతంలో ఉన్న జగన్ తనకు అన్న అని... సీఎం అయిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారని (YS Jagan completely changed) చెప్పారు. రక్తం పంచుకుని పుట్టిన తనపై... రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని (Sharmila Slams CM Jagan)మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా... అత్యంత నీచంగా ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. ఎవరెంత చేసినా భయపడే ప్రసక్తే లేదని... ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారు. అదిప్పుడు జగనన్న పాలనలో ఎక్కడ ఉంది. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 3,200 కి.మీ పాదయాత్ర చేశా. అలాంటిది ఇప్పుడు నాపైన మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు.రోజుకొకరితో నాపై వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారు. జగన్‌ను జైల్లో పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారు. అదంతా అబద్ధమని తెలిపారు. సోనియా గాంధీ దగ్గరికి అనిల్.. భారతి రెడ్డితో కలిసే వెళ్లేవారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడిగి తెలుసుకోండని అన్నారు.

కొణతాల రామకృష్ణతో భేటీ అయిన వైఎస్ షర్మిల, ఇప్పటికే జనసేనలో చేరుతున్నానని ప్రకటించిన మాజీ మంత్రి

కడప తాను పుట్టిన ఇల్లు అని షర్మిల అన్నారు. జగన్ మాదిరి తాను కూడా ఇక్కడే పుట్టానని, జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టానని చెప్పారు. జగన్ కు, పార్టీకి తాను చేసిన సేవలు వైసీపీ క్యాడర్ కు గుర్తులేవన్నారు. తన మీద రోజుకొక కథ అల్లుతున్నారని మండిపడ్డారు. తనపై బురద చల్లేందుకు రోజుకొక జోకర్ ను తెస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలని అన్నారు. విలువలు, విశ్వసనీయతలు మీకు లేవా? అని ప్రశ్నించారు. తాను రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిలారెడ్డినని... ఇదే తన ఉనికి అని చెప్పారు.