Vinod Jain (Photo-Video Grab)

VJY, April 26: బాలిక ఆత్మహత్య కేసులో మాజీ టీడీపీ నేత వినోద్‌కుమార్‌ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా పోక్సో కోర్టు విధించింది. సెక్షన్‌ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్‌ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాలికను లైంగికంగా వేధించిన వినోద్‌జైన్‌.. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు.ఈ కేసులో పోక్సో కోర్టు నిందితునికి రూ. 3 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం.. బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది.

ప్రేమ పేరుతో బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన మైనర్ బాలిక, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్‌

విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లోని లోటస్‌ లెజెండ్‌ అపార్ట్‌మెంట్‌లో టీడీపీ నేత వినోద్‌ జైన్‌ లైంగిక వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.అపార్ట్‌మెంట్‌ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజీలో కామాంధుని వికృత చేష్టల దృశ్యాలు ఉన్నట్లు తెలిసింది.

14 ఏళ్ల బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, ఆత్మహత్య చేసుకున్న బాలిక, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ

బాలిక అపార్ట్‌మెంట్‌ నుంచి దూకే దృశ్యాలు కూడా రికార్డ్‌ అయినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు బాలిక సూసైడ్ నోట్ రాసింది. రెండు నెలలుగా అంకుల్ నన్ను వేధిస్తున్నాడని స్కూల్‌కు వెళ్లి వచ్చే సమయాల్లో లిఫ్ట్, మెట్ల వద్ద వేచి ఉంటూ అసభ్యంగా ప్రవర్తించే వాడని లేఖలో తెలిపింది.