Amaravati, January 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 16న కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పుణెలోని సీరమ్ సంస్థ నుంచి రాష్ట్రానికి సుమారు 4,96,680 వ్యాక్సిన్ మోతాదుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేరుకుంది. రాష్ట్రంలో కొవిడ్19ను కట్టడి కోసం చేసిన ప్రయత్నాలు మంచి సత్ఫలితాలను ఇచ్చాయి, ఇప్పుడు ఇక వ్యాక్సిన్ రాకతో ప్రజలు ఈ మహమ్మారి బారి నుంచి ఊపిరి పీల్చుకునే రోజులు వచ్చాయి. టీకా పొందే వరకు ప్రజలు ఎప్పట్లాగే కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికార యంత్రాంగం పేర్కొంటుంది.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,986 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 197 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,85,234కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,82,339గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో ఎక్కువగా కృష్ణా జిల్లా నుంచి 49, చిత్తూరు నుంచి 32 మరియు గుంటూరు జిల్లా నుంచి 31 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో కరోనాతో కృష్ణా జిల్లా మరియు కడప జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు చనిపోయారు. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7133కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 234 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,75,690 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2,411 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.