Andhra Pradesh Transport Minister Perni Nani(photo-Twitter)

Amaravati, Dec 28: సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా (Movie Ticket Prices Issue) మారింది. ఇందులో భాగంగా మంత్రి పేర్నినానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. సినిమా టిక్కెట్ ధరలు (movie ticket prices), థియేటర్ల ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు. 19 మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎఫ్డీసీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే 11 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సినిమా టికెట్ల ధరలపై హీరో నాని, సిద్దార్థ్‌లకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలో ఆయన (Minister Perni Nani) మీడియాతో మాట్లాడుతూ.. మాట్లాడేవాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. సెప్టెంబర్‌లో డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్లుతో సమావేశం పెట్టాం. ఆ రోజే సినిమా హాళ్ల యజమానులు అనుమతులు, ఫైర్‌ ఎన్‌ఓసీ కానీ తీసుకోవడం లేదు. వీటిని రెన్యువల్‌ చేసుకోమని ఆనాడే చెప్పాము. అయినా అనుమతులు లేకుండా నడిపారు. అనుమతులు తీసుకోని థియేటర్లపైనే చర్యలు తీసుకున్నాం. ఇందులో ఎవరి మీదనో కక్ష ఎందుకు ఉంటుంది. 130 సినిమా హాళ్ల పై చర్యలు తీసుకున్నాము. ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లే. చిత్తూరులో 24, కృష్ణా జిల్లాఓ 12 సీజ్ చేశాము. లైసెన్స్ లేని వాళ్ళు 22 థియేటర్లు మూసేశారు. 83 సీజ్ చేశాం, 23 థియేటర్లపై ఫైన్ వేశాం. జీవో 35ని ఏప్రిల్‌లో ఇచ్చాము. మరి ఈ రోజు ఆ జీవోకి నిరసనగా మూసివేయడానికి నాని ఏ ఊరు లో ఉన్నారో.. ఆయన ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదు.

తారక్ గురించి ఎమోషనల్ అయిన రాంచరణ్, తనది సింహంలాంటి పర్సనాలిటీ, చిన్నపిల్లల మనస్తత్వం, నేను చనిపోయేవరకు నా మనసులో పెట్టుకుంటానంటూ భావోద్వేగం

మరో నటుడు సిద్దార్థ్ ఎక్కడుంటారు..?. ఆయన చెన్నై లో స్టాలిన్ కోసం మాట్లాడారేమో. సిద్దార్థ్ ఏమైనా ఇక్కడ టాక్స్‌లు కట్టాడా. మా ఇళ్లకి వచ్చి చూసాడా. మేము ఎంత విలాసంగా ఉంటున్నామో. ఆయన స్టాలిన్ కోసమో, మోడీ కోసమో అనుంటాడు. ఎవరి కోసమో నిర్ణయాలు తీసుకోము. ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. మేము హైకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటున్నాం. ఎవరితోనైనా ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య అయినా వినడానికి మేం సిద్ధం. ప్రభుత్వానికి ఏదో అపాదించి మాట్లాడటం ధర్మం కాదు' అని మంత్రి పేర్ని నాని అన్నారు.

సినిమా టికెట్ ధరలపై డిస్ట్రిబ్యూటర్లు ప్రతిపాదనలు ఇచ్చారు. కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లో అత్యధికంగా రూ.150, లోయర్‌ క్లాస్‌లో రూ.50 ఉండాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.100, లోయర్‌ క్లాస్‌లో రూ.40 ఉండాలని కోరారు. సినీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఎవరి మీదా కోపం లేదు.. ఉండదు. రేట్‌లు రివ్యూ చేయడానికి కమిటీ వేశారు. అభ్యంతరాలు ఉంటే కమిటీ దృష్టికి తీసుకురావచ్చు. గతంలో బాలకృష్ణ సినిమాకు మినహాయింపు ఇచ్చి.. చిరంజీవి సినిమాకు ఇవ్వలేదు. అయితే జగన్‌కు మాత్రం అలాంటి రాగద్వేషాలు ఉండవు’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

కొన్ని థియేటర్లలో కనీసం ప్రమాణాలు పాటించడం లేదు. రెన్యూవల్ చేయకుండానే కొన్ని థియేటర్లను నడిపిస్తున్నారు. థియేటర్లు రెన్యూవల్ చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ప్రమాణాలు పాటించని కొన్ని థియేటర్లను సీజ్‌ చేశాం. హాళ్లలో వసతులు మెరుగుపర్చాలని ఇదివరకే చెప్పాం. హైకోర్టు సూచనల మేరకు కమిటీ ఏర్పాటు చేశాం. వివిధ సంఘాల సూచనలు, విజ్ఞప్తులను కమిటీ పరిశీలన చేస్తుంది. సామాన్యులకు వినోదాన్ని ఇవ్వడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ నిర్ణయిస్తుంది. చాలా థియేటర్లు ఫైర్ సేఫ్టీ, బీఫామ్‌ లేకుండా నడుస్తున్నాయి. త్వరగా రెన్యువల్ చేసుకోవాలని కోరాం. రెన్యువల్‌ చేసుకోని థియేటర్లపై చర్యలు తీసుకున్నాం. కొందరు ఎత్తుగడలో భాగంగా జీవోకు నిరసనగా మూసేశామంటున్నారు’ అని మంత్రి చెప్పారు.