Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ, మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటానని తెలిపిన సీఎం జగన్
AP CM YS Jagan |File Photo

Madanapalle, Nov 30: ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన ( Jagananna Vidya Deevena scheme ) కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేసింది. సీఎం జగన్ మదనపల్లెలో బటన్‌ నొక్కి నొక్కి నేరుగా ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేశారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం (Jagananna Vidya Deevena) కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh govt) అమలు చేస్తోంది.

ఏపీలో రానున్న రెండు రోజుల్లో మళ్లీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బులిటెన్ విడుదల చేసిన ఐఎండీ

కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మాట్లాడుతూ.. పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువే. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తెచ్చారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారు. ఆతర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చాయి. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం అని సీఎం జగన్‌ చెప్పారు. విద్యాదీవెనకు తోడు జగనన్న వసతి దీవెన ఇస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చాం. పేదలకు చదువును హక్కుగా మార్చాం.

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురు, సమీర్‌ శర్మపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ కొట్టివేత

చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించాం. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించాం. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.684 కోట్లు జమ చేస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నాం. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించం.. ఆస్తిగా భావిస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నా. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని సీఎం జగన్‌ అన్నారు.