Representational Image | (Photo Credits: PTI)

Amaravati, Nov 30: ఏపీ రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న రెండురోజుల్లో (rainfall next Two days) మళ్లీ వర్షాలు మొదలు కానున్నాయి. గురువారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో (Rayalaseema, coastal Andhra) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది.

అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. మరోవైపు డిసెంబర్‌ నాలుగో తేదీన దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం విలీనం కానుంది. తరువాత అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.రానున్న మూడు రోజులకు సంబంధించి రాష్ట్ర వాతావరణ నివేదికను అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసింది.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరికొన్ని చోట్ల తీవ్రమైన చలి ఉంటుంది.మరికొన్ని చోట్ల తీవ్రమైన చలి ఉంటుంది.

వీడియో, అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్, నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏపీ ముఖ్యమంత్రి

అమరావతి వాతరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా ఆయా ప్రాంతాల్లో తీవ్రమైన చలి ఉంటుంది. మరొకొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి. ఉత్తరకోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుంది. ఇక దక్షిణ కోస్తాంధ్రాలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఉంటుంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు..ఇక రాయలసీమలో ప్రాంతంలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.మరి దీంతొ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఏపీ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్, 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. దాంతో అధికారులు ఎరోడ్ జిల్లాకు వ‌ర‌ద హెచ్చ‌రిక జారీ చేశారు. ఈరోడ్‌లో ఇప్పటివరకు 358.12 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సత్యమంగళం, గోబిచెట్టిపాలెం, గుండ్రిపాళ్యం, అమ్మపేట ప్రాంతాల్లోని కాల్వలు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గోబిచెట్టిపాలెంలో వరి పొలాలు నీట మునిగాయి. పంట నష్టాన్ని అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ సిబ్బందిని ఆదేశించారు. గుండెరిప‌ల్లం డ్యామ్ సామ‌ర్థ్యానికి మించి వ‌ర‌ద నీరు చేరింది. అధికారులు సోమ‌వారం 1,492 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుదల చేశారు. అంతేకాదు న‌దులు, చెరువుల స‌మీపంలోకి వెళ్ల‌కూడ‌ద‌ని చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌ల‌ను కోరారు.