Amaravati, Mar 23: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) కర్నూలు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం (Center Sensational Announcement)సంచలన ప్రకటన చేసింది. పార్లమెంట్‌లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు స్పష్టతనిచ్చారు. హైకోర్టును కర్నూలు (Kurnool)కు తరలిచాలంటే ఏపీ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టం (AP Redistribution Act) ప్రకారం రాష్ట్ర హైకోర్టు అమరావతి (Amaravathi)లో ఏర్పాటైందన్నారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (MP Kanakamedala Ravindra Kumar) అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు అయిందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana)కు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటయిందన్నారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని, సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయని కిరణ్ రిజిజు అన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు