Amaravati, Nov 1: అమరావతి పాదయాత్రకు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. షరతులకు లోబడే పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది.ఈ మేరకు అమరావతి పాదయాత్రకు సంబంధించి వేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా పోలీసులకు చూపించాలని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. పాదయత్రలో పాల్గొనకుండా మరే రకంగా అయినా సంఘీభాం తెలపవచ్చని తెలిపిన కోర్టు.. తమ ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని పేర్కొంది.
పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని, ఐడీ కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐడీ కార్డులు రైతుల (farmers)కు వెంటనే ఇవ్వాలని పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది.