MP Gorantla Madhav: వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్, నాపై వాళ్లు ముగ్గురు కుట్ర చేశారని వెల్లడి, ఆ వీడియో ఫేక్ అని తెలిపిన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప
Gorantla Madhav (photo-Video Grab)

Amaravati, August 10: గత కొద్ది రోజుల నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న న్యూడ్ మార్ఫింగ్‌ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ (Kuruva Gorantla Madhav) విలేకరుల సమావేశంలో క్లారిటీ (Gorantla Madhav clarified) ఇచ్చారు. గోరంట్ల మాధవ్‌ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాజకీయ కుట్ర అని కొంత మంది దుర్మార్గులు చేసిన పని అని మండిపడ్డారు.ఇది మార్ఫింగ్‌ చేసిన వీడియో అని ఆరోజే చెప్పానని అన్నారు.

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, ఏబీఎన్‌, టీవీ-5 కుట్ర చేశారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ ఓ ‍బ్రోకర్‌. నూటికి నూరు శాతం ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. మీ చరిత్ర హీనమైంది. చంద్రబాబు నీకు కళ్లు కనపడటం లేదా?. ఇకనైనా నీ నీచ రాజకీయాలు మానుకో. ఇలాంటి నీచమైన చర్యలతో నీ పార్టీ బతకదు. తెలుగుదేశం పార్టీ నికృష్టపు ఆలోచనలు చేస్తోంది.

నేను కడిగిన ముత్యంలాగే బయటకు వస్తానని తెలుసు. ఫేక్‌ వీడియో సృష్టించి నన్ను అవమానించాలని చూశారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తాను. టీడీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ్యతిరేక పార్టీ. వెనుకబడిన వర్గాలు ఎదిగితే ఓర్వలేని పార్టీ అది. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారు. నాకు మద్దతు తెలిపిన వారందరకీ కృతజ్ఞతలు. ఇక ఈ రాద్దాంతానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి అంటూ కామెంట్స్‌ చేశారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు అంటూ వైరల్ వీడియో, అది మార్ఫింగ్ అంటూ క్లారిటీ ఇచ్చిన ఎంపీ, వీడియో నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపిన సజ్జల

ఏదో జరిగిపోతోందని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారు. అయ్యన్న పాత్రుడు విషం చిమ్మాలని చూశారు. వీడియో​ వెనుక ఉన్నవారెవరో పోలీసులు తేల్చాలి. ఏబీఎన్‌, టీవీ5 టీడీపీని ఎంతగా లేపాలని చూసినా ఆ పార్టీ లేవదు. టీడీపీ నేతలకు కనీసం నైతిక విలువలు కూడా లేవు. టీవీ5, ఏబీఎన్‌ యజమానులు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. అరగుండు అయ్యన్నపాత్రుడి కుమారుడు నాపై విషం చల్లారు అని మండిపడ్డారు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ఒరిజినల్‌ కాదని, ఫేక్‌ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నాం ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్‌ కాదని, ఫేక్‌ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్‌ లేదా ఎడిటింగ్‌ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వీడియోను చూస్తున్న విజువల్స్‌ను.. వీడియో తీసి పోస్ట్‌ చేశారు అని ఆయన వెల్లడించారు. వీడియోను మార్ఫింగ్‌ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ఐ.టీడీపీ వాట్సాప్‌ గ్రూపులో మొదట వచ్చింది. 4వ తేదీ అర్ధరాత్రి 2.07కు +447443703968 నెంబర్‌ నుంచి పోస్ట్‌ చేశారు. యూకేలో రిజిస్టర్‌ అయిన నెంబర్‌తో వీడియో అప్‌లోడ్‌ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ నెంబర్‌ ఎవరిదో కనుక్కునే పనిలో ఉన్నాం. వీడియో ఫార్వర్డ్‌, రీపోస్ట్‌ చేయడం వల్ల అది ఒరిజినల్‌ అని గుర్తించలేకపోతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ అని నిర్ధారించలేమని, అలాగే ఒరిజినల్‌ వీడియో దొరికే దాకా ఏం చెప్పలేమని ఎస్పీ తేల్చి చెప్పారు.