AP deputy chief minister Narayana Swamy (Photo-Twitter)

Amaravati, Dec 30: తమకు అధికారం ఇస్తే 50 రూపాయలకే నాణ్యమైన క్వార్టర్ లిక్కరు ఇస్తామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై అన్ని పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, తెలంగాన మంత్రి కేటీఆర్, తృణమూల్ పార్టీలు ట్విట్టర్ వేదికగా సోము వీర్రాజు వ్యాఖ్యలపై కామెంట్లు చేశారు. ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (AP deputy chief minister Narayana Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతరం ఆలయ వెలుపల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా (political party or a liquor company) అర్థం కావడం లేదన్నారు. చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం జగన్ ఓ సింహం, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే కోటీశ్వరులకు లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలు చంద్రబాబు మాట వింటున్నాయన్నారు.

మాకు కోటి ఓట్లు వేస్తే రూ.70కే మద్యం అందిస్తాం, ఆదాయం ఉంటే మద్యం ధర రూ.50కి తగ్గిస్తాం, ప్రజాగ్రహ సభలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి డిపాజిట్లు కూడా రావని మోదీ గుర్తించాలని హితవు పలికారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అర్థం కావడం లేదని, ఎవరెన్ని కుట్రలు చేసిన సీఎం జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని నారాయణ స్వామి అన్నారు.

తమకు అధికారం ఇస్తే 50 రూపాయలకే నాణ్యమైన క్వార్టర్ లిక్కరు ఇస్తామని వ్యాఖ్యానించి విమర్శల పాలైన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. పేదల కష్టాన్ని జగన్ ప్రభుత్వం దోచుకుంటోందని, అందుకనే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. మద్యం కోసం పేదలు రోజూ రూ. 250 వరకు ఖర్చు చేస్తున్నారని, ఆ ఖర్చులో రూ.200 తగ్గితే ఆ కుటుంబంపై భారం తగ్గుతుందని, ప్రతి నెలా రూ. 6 వేలు ఆదా అవుతాయని అన్నారు.

సోము వీర్రాజు క్వార్టర్ సీసా రూ.50 వ్యాఖ్యలు, ఎంత సిగ్గుమాలిన హామీ అంటూ ట్విట్టర్లో సెటైర్ వేసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై విరుచుకుపడిన వారిపై వీర్రాజు మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేనికి రాత్రుళ్లు ఎక్కువై ఉదయం నోరు మడతపడుతుందని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణను మొబైల్ పొలిటీషియన్‌గా అభివర్ణించారు. మంత్రి కొడాలి నాని చేతికి దారాలు తప్ప తలలో మెదడు లేదని అన్నారు. లీజుల గురించి మాట్లాడితే వైసీపీ నేతల చొక్కాలు ఊడతాయన్న విషయాన్ని మంత్రి పేర్ని నాని తెలుసుకోవాలని చురకలు అంటించారు. తమను జగన్ పార్టీ అంటున్న పయ్యావుల నిజం తెలుసుకోవాలని సోము వీర్రాజు సూచించారు.