Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Vjy, Sep 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ నెల ప్రారంభంలొ వరదలు ముంచెత్తిన సంగతి విదితమే. ముఖ్యంగా విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయి. దాని నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. అయితే ఈ విపత్తు నుంచి తేరుకోకముందే మరో తుఫాను హెచ్చరిక ఏపీ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబు­తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24న ఏర్పడే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొ­న్నారు. తుపానుగా మారితే.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకా­శాలుంటాయని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభా­వంతో 20 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పారు.