Amaravati, May 26: వచ్చే మూడు రోజులు ఏపీలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం(Moderate Rainfall in AP) ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటలలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఎండలు బాబోయ్ ఎండలు, మరో 3 రోజులు పాటు నిప్పుల వానలా ఎండ, ప్రజలెవరూ బయటికి రావొద్దని అధికారుల సూచన
అదేవిధంగా దక్షిణ కోస్తా ఆంధ్రాలో మూడు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.