Corona in AP: ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు, తాజాగా 3,435 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌, కొత్తగా 2,100 మందికి కరోనా పాజిటివ్‌, వ్యాక్సినేషన్‌పై మరింత ధ్యాస పెట్టాలని సమీక్షలో తెలిపిన ఏపీ సీఎం
Coronavirus test (Photo-ANI)

Amaravati, July 5: ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గడంతోపాటు, రికవరీల రేటు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 72,731 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,100 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in AP) నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 26 మంది (Covid Deaths) మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,870 కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 3,435 మంది కోవిడ్‌ (Covid) నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 58 వేల 189 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 33,964 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,90,5023 కు చేరింది. రాష్ట్రంలో నేటి వరకు 2,24,35,809 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. కోవిడ్‌ కేసుల నమోదు, లాక్‌డౌన్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది, కేంద్ర మంత్రులకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ ప్రాజెక్టులు సందర్శించాకే ఏపీ ప్రాజెక్టులు సందర్శించాలని లేఖలో తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ వ్యాక్సినేషన్‌పై మరింత ధ్యాస పెట్టాలి. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ఇస్తున్నాం. ఐదేళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. గర్భిణీలు, ఉపాధ్యాయులకూ వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు నెలల్లోగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల పనులు పూర్తి చేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపుల్లో పలు మార్పులు ప్రకటించింది. తాజా నిబంధనల ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపునిచ్చిన ప్రభుత్వం.. ఆయాచోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేసింది.

సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఆ నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ నెల రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు, బీమా పథకాల వివరాలు ఓ సారి తెలుసుకోండి

అదే విధంగా.. రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే, సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌ ఉండాలని ఆంక్షలు విధించింది. ఇక కోవిడ్‌ ప్రొటోకాల్స్‌తో రెస్టారెంట్లు, జిమ్స్‌, కల్యాణ మండపాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం... శానిటైజర్‌, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పని సరి అని పునరుద్ఘాటించింది.