
Amaravati, Sep 28: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 45,592 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 771 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 8 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,150 కు చేరింది.
గత 24 గంటల్లో 1,333 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 11,912 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,48,230 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,81,78,305 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
దేశంలో కొత్త 18,795 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ (Coronavirus in India) వల్ల మృతిచెందిన వారి సంఖ్య 179గా ఉంది. కొత్తగా 26,030 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి దేశంలో 4,47,373 మంది మరణించారు. మొత్తం టీకాలు తీసుకున్నవారి సంఖ్య 87 కోట్లు దాటింది. ఈ ఏడాది మార్చి 11వ తేదీ తర్వాత ఒకే రోజు 20 వేల కేసుల కన్నా తక్కువ సంఖ్యలో కేసులు ( Lowest in 6 Months) నమోదు కావడం ఇదే మొదటిసారి. నిన్నటితో పోలిస్తే కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది.