Andhra Pradesh: స్వల్ప అస్వస్థతకు గురైన ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపిన వైద్యులు
Pinipe-Viswarup (Photo-Video Grab)

Rajahmundry, Sep 2: ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, విశ్వరూప్‌ను హెల్త్‌ కండీషన్‌ను పరిశీలించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆయనను ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి , నాన్నకు తలుచుకుంటూ భావోద్వేగానికి గురైన ఏపీ సీఎం జగన్, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయంటూ ట్వీట్

కాగా, ఈరోజు(శుక్రవారం) వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా మంత్రి విశ్వరూప్‌.. పలు కార్యక్రమాల్లో​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చేయి లాగుతుందని నాయకులకు చెప్పడంతో విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంకి తీసుకు వెళ్లారు.