YSR Death Anniversary

Amaravati, Sep 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర తండ్రికి నివాళులు ( CM YS Jagan pays homage ) అర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి (YSR Death Anniversary) సందర్భంగా.. తన తండ్రిని తలుచుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’ అన్నారు.

తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు, ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, వైఎస్సార్ గురించి ఎవరేమన్నారంటే..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా.. తన తండ్రిని తలుచుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’ అన్నారు.