Y. S. Rajasekhara Reddy Birthday: తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు, ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, వైఎస్సార్ గురించి ఎవరేమన్నారంటే..
Y. S. Rajasekhara Reddy Birthday (Photo-Twitter)

Kadapa, July 8: ప్రజల నేత, తెలుగు ప్రజల గుండె చప్పుడు, దివంగత ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి (Y. S. Rajasekhara Reddy) ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 71వ జయంతి (Y. S. Rajasekhara Reddy Birthday) సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. అక్కాచెల్లెమ్మలకు ఆస్తిని ఇద్దామంటే టీడీపీ అడ్డుపడుతోంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, స్పందన సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్

ఈ కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌కు నివాళి (YSR jayanthi 2020) అర్పించిన అనంతరం "నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వైఎస్‌ విజయమ్మ రచించారు. వైఎస్సార్‌ స్వర్గస్థులైన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం "నాలో.. నాతో వైఎస్సార్‌". వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకం.

వీటితోపాటు ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. ట్రిపుల్ ఐటీ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా, వైఎస్సార్‌ జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పేద రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, సన్న, చిన్న కారు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా స్కీమ్ కింద ఉచిత బోర్ పథకం, అర్హతలు ఇవే

పుస్తకావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. ‘బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం. అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన సుదీర్ఘ ప్రయాణంలో నాన్న చూసిన విధానాన్ని పుక్తకరూపంలో తీసుకొచ్చింది. ఇది ఒక మంచి పుస్తకం’అని పేర్కొన్నారు.

వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ.. ‘ఆయనలో చూసిన గొప్పగుణం. 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి నేను తెలుసుకున్న విషయాల గురించి రాయాలనిపించింది. ఆయనలోని మూర్తిభవించిన మానవత్వం​, ఆయన మాటకిచ్చే విలువ నలుగురికి తెలియజెప్పాలనిపించింది. ఆయన ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారు. ఎంతో మంది అది మాకిచ్చిన భాగ్యం అనుకుంటా. ప్రతిఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నా. నా బిడ్డల మాదిరిగా ఆయన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు తెలుసుకుని ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నా. సహృదయంతో ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని కోరుకుంటున్నా’అని విజయమ్మ పేర్కొన్నారు.

AP CM YS Jagan Tweet on YSR Birthday

సంక్షేమ ప‌థకాల‌ను ప్ర‌వేశపెట్టి వాటి ఫ‌లాల‌ను ప్ర‌తి పేద‌వాడికి అందించిన గొప్ప వ్య‌క్తి.. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్య దైవం.. డాక్టర్‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌ను స్మ‌రించుకుంటూ బుధవారం నివాళులర్పించారు. "నాన్న‌గారి 71వ జ‌యంతి నేడు. ఆయ‌న మ‌ర‌ణం లేని మ‌హానేత‌. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవ‌లు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, రైతుల‌కు ఉచిత విద్యుత్‌, జ‌ల‌య‌జ్ఞం.. ఇలా ఎన్నో ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవే.. రైతు ప‌క్ష‌పాతి అయిన మ‌హానేత జ‌యంతిని రైతు దినోత్స‌వంగా జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది" అంటూ సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

వైయస్సార్ 71వ జ‌యంతి సంద‌ర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌ ట్విట‌ర్ వేదిక‌గా నివాళులు అర్పించారు. "ఒక్క సంతకంతో పేదవాడి జీవితంలో వెలుగు నింపవ‌చ్చు, రోడ్డు మధ్యలో ఆగిపోతున్న ప్రాణాలను 108తో కాపాడవచ్చు. పేదవారికి రెండు రూపాయలతో కడుపు నింపవ‌చ్చు. ఉచితంగా కార్పొరేట్ విద్యా, వైద్యం అందించవ‌చ్చు, జలయజ్ఞంతో ప్రతి ఎకరా సాగు చెయ్యొచ్చు అని నిరూపించిన దేవుడు వైఎస్సార్" అని ట్విట‌ర్‌లో ట్వీట్ చేశారు.

Here's YSRCP MP Tweet

Here's Minister Anilkumr yadav Tweet

రైతు బాంధ‌వుడు వైఎస్సార్ జ‌యంతిని రైతు దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నాం. తండ్రీకొడుకుల‌కు ప్ర‌జ‌లంటే అంతులేని ప్రేమ‌. ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు వైఎస్సార్‌. పేద‌ల ప‌క్ష‌పాతిగా నిలిచిన ఆయ‌న 71వ జ‌యంతిని ఘ‌నంగా జ‌రుపుకుందాం.. ఆయ‌న సేవ‌ల‌ను మ‌న‌నం చేసుకుందాం" అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజ‌య‌సాయి రెడ్డి పిలుపునిచ్చారు. "తెలుగు నేల ఉన్నంత‌వ‌ర‌కు మాత్ర‌మే కాదు.. సూర్య‌చంద్రులు ఉన్నంత‌వ‌ర‌కు ప్ర‌తి పేదోడి గుండెల్లో వైఎస్సార్ చిరంజీవుడే" అంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ట్విట‌ర్‌లో రాసుకొచ్చారు.

తెలుగు నేలపై చెరగని సంతకం

యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి ( వైఎస్ రాజశేఖర్‌రెడ్డి).. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు బాధత్యలు స్వీకరించి.. తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. సుధీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.. ప్రజలకు గుండె చప్పుడు అయ్యారు. పథకాల విషయానికి వస్తే ఆరోగ్య శ్రీ నుంచి 108 వరకు.. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నుంచి రుణమాఫీ వరకు ఇలా చెప్పుకుంటే పోతే చాలా పథకాలే ఉన్నాయి.

ఉచిత కరెంట్: 2004లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన తొలి సంతకం ఈ ఉచిత కరెంట్ ఫైల్ మీదే పెట్టారు. ప్రతిపక్షాల నుంచి ఎన్నో విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా రైతులకు ఉచిత కరెంట్ అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ : ఒకప్పుడు ఉన్నత చదువులు చదువుకోవాలంటే లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉండేది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ వెంటనే విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చదువులు ఆపేసిన విద్యార్థులు కూడా ఈ పథకం ద్వారా మళ్లీ చదువుకున్నారు. ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత వైఎస్‌కు దక్కుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ పథకం నిర్విరామంగా కొనసాగుతోంది.

 జలయజ్ఞ‌ం: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనలో నుంచి వచ్చిన మరో మానసపుత్రిక జలయజ్ఞ‌ం. అన్నదాతల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా పొలాలకు సాగునీటిని అందించాలనే సంకల్పంతో జలయజ్ఞ‌ం తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాధాన్యతా క్రమంలో కొత్త ప్రాజెక్టుల్ని, ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు.. అనతికాలంలోనే కొన్నింటిని పూర్తి చేశారు. ప్రతిపక్షాల నుంచి జలయజ్ఞ‌ం ధనయజ్ఞ‌ం అంటూ విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.

రూ.2కే కిలోబియ్యం: ఎన్టీఆర్ హయాంలో అమలైన ఈ పథకం తర్వాత కాస్త నెమ్మదించింది. వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ఈ పథకాన్ని అమలు చేశారు. రూ.2 రూపాయలకే నాణ్యమైన బియ్యాన్ని పేదలకు అందించారు.. ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాల కడుపు నింపారు.

ఇందిరమ్మ ఇళ్లు: పేదవాడి సొంతింటి కలనున నిజం చేయడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను తీసుకొచ్చారు . అర్హులైన పేదవాళ్లను గుర్తించి ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు గూడు కల్పించిన ఘనత ఆయనకే దక్కింది.  ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా ఇప్పుడు ఏకంగా 30 లక్షలమందికి పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.

రైతు రుణమాఫీ: రైతు రుణమాఫీని తీసుకొచ్చిన ఘనత కూడా వైఎస్‌కు దక్కుతుంది.  గతంలో పండిన పంటకు గిట్టుబాటు ధరలేక, పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాక, బ్యాంకులకు వడ్డీలు, రుణాలు చెల్లించలే రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో ఆపద్భాందవుడిలా రుణమాఫీని ప్రవేశపెట్టారు.

108 సర్వీస్: 108 వాహనాల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. కుయ్, కుయ్ అంటూ వచ్చి ఆపదలో ఉన్నవారిని ఆస్పత్రులకు చేర్చడంలో 108ది కీలక పాత్ర.  దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలకు ఈ వాహనాలను పరిచయం చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. ప్రైవేట్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకొచ్చారు.

ఆరోగ్య శ్రీ పథకం: ఆరోగ్య శ్రీ పథకం పేరు చెప్పగానే కచ్చితంగా ఎవరికైనా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తు వస్తారు. స్వతహాగా డాక్టర్ అయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేద ప్రజల కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం.ఈ పథకం ద్వారా లబ్ది పొందిన ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ వైఎస్సార్‌ను ఓ దేవుడిలా కొలుస్తున్నాయి.