Roja on Bandaru Comments (Photo-Video Grab)

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి బండారు సత్య­నా­రా­యణ.. ఏపీ మంత్రి రోజాను ఉద్దేశిస్తూ నీచాతి నీచంగా విమర్శించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో.. తనకు ఎదురైన అవమానంపై మంత్రి రోజా మంగళవారం తిరుపతి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసత్య ఆరోపణలు, విమర్శలతో మహిళల వ్యక్తిత్వాన్ని కాల్చివేస్తున్న టీడీపీ దుశ్సాసన పార్టీ అని ఆమె ఘాటుగా విమర్శించారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మహిళా లోకాన్నే అవమానించేలా మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యక్తిగత విమర్శలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నారంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

వీడియో ఇదిగో, నువ్వు ఎవరెవరి దగ్గర పడుకున్నావో తెలుసంటూ మంత్రి రోజాపై దారుణంగా కామెంట్లు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు

బ్లూ ఫిలిమ్స్‌లో నటించింది అంటూ నన్ను టార్చర్‌ చేస్తున్నారు.. అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు.. కానీ, ఎప్పుడూ నిరూపించలేదు. మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది. మీరెవరు నా క్యారెక్టర్‌ను జడ్జ్‌ చేయడానికి? మహిళల్ని టీడీపీ ఆట వస్తువుల్లా చూస్తోంది. దమ్ముంటే సీడీలను ప్రజల్లోకి విడుదల చేయాలి. నాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరికాదు.

Here's Video

లోకేశ్‌తో పాటు ఇతర టీడీపీ నేతలు సత్యనారాయణ అరెస్టును ఖండించారు. వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా? మహిళపై అభ్యంతరకర ఆరోపణలు చేస్తే బండారు కుటుంబం, టీడీపీ ఖండించకుండా ఆయనకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు. ఎన్టీయార్‌కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారు. లోకేశ్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవడం బ్రాహ్మణి మానుకుని జగన్న చేస్తున్న అభివృద్ధిని స్వాగతించాలి.

టీడీపీ అంటే దండుపాళ్యం పార్టీ.. తెలుగు దొంగల పార్టీ, తెలుగు దుశ్శాసన పార్టీ. ఆడ పుట్టుకను అపహస్యం చేసిన వ్యక్తి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దుపెట్టాలి అని చెప్పిన వ్యక్తి ఆ పార్టీ ఎమ్మెల్యే.. మహిళలంటే అంత చిన్నచూపు చూసే టీడీపీలో మహిళలంటే ఎలా గౌరవం ఉంటుంది? మహిళలు రాజకీయాల్లోకి రావటమే తప్పు అన్నట్లు దండుపాళ్యం నేతలు ఒళ్లు బలిసి విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో 20 ఏళ్లుగా ఉన్నా.. మహిళా సాధికారితకు పాటుపడుతున్నా.

రాళ్ల దాడి ప్లాన్ ఆధారాలు చూపించు, పవన్ కళ్యాణ్‌కు నోటీసులు ఇచ్చిన కృష్ణా జిల్లా పోలీసులు

మహిళలను కానీ, మా నాయకుడు జగనన్నను కాని విమర్శిస్తే ఊరుకోను. ఇలాంటి దిగజారుడు విమర్శలతో తన గొంతు నొక్కాలని ప్రయత్నించినా ఊరుకోను. బండారును వదిలిపేట్టేది లేదు. అతనిపై పరువునష్టం దావావేసి న్యాయపోరాటం చేస్తా. ఇక నగరి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా నా పనితీరుపై చర్చకు రావాలి. ధమ్ముంటే నా నియోజకవర్గానికి వచ్చి అభివృద్ధి చూడండి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి. అంతేగానీ.. చేతకాని దద్దమ్మల్లాగా ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడొద్దని మండిపడ్డారు.