Andhra Pradesh Mishap: తిరుపతి రుయా ఆస్పత్రిలో విషాదం, ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్‌ రోగులు మృతి, ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
Visuals from Ruia Government Hospital in Tirupati (ANI)

Tirupati, May 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో విషాదం (Andhra Pradesh Mishap) చోటు చేసుకుంది. సకాలంలో ఆక్సిజన్‌ అందక 11 మంది కొవిడ్‌ రోగులు మృ తి (11 Patients Die Due to Low Pressure Oxygen) చెందారు. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలగడం వల్ల 11 మంది కరోనా రోగులు మృతిచెందారని చిత్తూరు కలెక్టర్‌ ప్రకటించారు. శ్రీపెరంబదూర్‌ నుంచి ఆస్పత్రికు చేరుకోవాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు.

ఆస్పత్రి (11 Patients Die Due to Low Pressure Oxygen) వైద్యులు, సిబ్బంది హుటాహుటిన ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించారని.. దీంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఆక్సిజన్‌ అందకపోవడంతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి ఆయ్యారు. దీంతో శ్వాస అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నంచేశారు. వైద్యులతోపాటు రోగుల బంధువులు ఎంతగా ప్రయత్నించినా పరిస్థితి తీవ్రంగా ఉన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రుయా ఘటనపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

కాల్ చేయగానే 104 రావాలి, ఫోన్‌ కలవలేదని, స్పందన లేదని చెప్పకూడదు, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం, జిల్లాల్లో బెడ్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని తెలిపిన వైయస్ జగన్

విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆక్సిజన్‌ అందక 11 మంది చనిపోయిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. అలాగే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే రఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.