
Amaravati, July 21: ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా (Mother along with two children) తల్లి ఆత్మహత్య చేసుకుంది. వారి మృతదేహాలు బుధవారం శింగనమల రంగరాయల చెరువులో బయటపడ్డాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన బి.రామాంజినేయులుకు పదేళ్ల క్రితం పామిడి మండలం ఎదురూరు గ్రామానికి చెందిన కవిత(27)తో వివాహమైంది. వీరికి సంతోష్ (7), భార్గవి (3) సంతానం. వీరంతా గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.
అయితే..నాలుగు నెలల క్రితం తాడిపత్రి (Tadipatri) పట్టణానికి మకాం మార్చారు. రామాంజినేయులు గుజిరీ షాపులో పనికి వెళుతుండగా.. భార్య ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకునేది. రామాంజనేయులు మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై రోజూ దంపతులు రోజూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా వాదులాడుకున్నారు. భర్త ప్రవర్తనలో మార్పు కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది.
షాకింగ్ పుటేజి, ఓవ్యక్తి రైల్వే ట్రాక్ దాటుతుండగా వేగంగా వచ్చి ఢీ కొట్టిన రైలు, అక్కడికక్కడే మృతి
మంగళవారం ఉదయం 11 గంటల తరువాత పుట్టింటికి వెళుతున్నానని భర్తకు చెప్పిన కవిత కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. బస్సులో బయల్దేరి శింగనమల క్రాస్ వద్ద దిగింది. అక్కడి నుంచి పిల్లలతో కలిసి రంగరాయల చెరువు మరవకట్టపైకి నడుచుకుంటూ వెళ్లింది. జీవితం నరకప్రాయంగా అనిపించడంతో ఆత్మహత్య ( commits suicide in Singanamala) చేసుకోవాలనుకుంది. పిల్లలు దిక్కులేని వారు కాకూడదని.. వారినీ తనవెంటే తోడు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని చెరువులోకి దూకారు.
బుధవారం మధ్యాహ్నం ముగ్గురి మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అనంతపురం ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు, శింగనమల సీఐ అస్రార్ బాషా, ఎస్‌ఐ వంశీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీయించి..పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య, పిల్లలు చనిపోయినా భర్త సంఘటన స్థలం వద్దకు రాలేదు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.