MLA Sridhar Reddy Health Update (Photo-Twitter)

Nellore, May 27: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమంచర్లలో ‘జగనన్న మాట-గడపగడపకూ కోటంరెడ్డి బాటలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అరుంధతీ వాడలో సహపంక్తి భోజనం చేసిన అయన అలసటకు (MLA Sridhar Reddy Health Update) గురయ్యారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకొన్న కోటంరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన్ని (Kotamreddy Sridhar Reddy Fell Sick ) కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యులు చెన్నైకి రెఫర్ చేసారు.

సమాచారం అందుకొన్న మంత్రి కాకాణి ఆసుపత్రికి చేరుకుని కోటంరెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితిపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి కోటంరెడ్డిని తరలించారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరా తీశారు. ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్‌రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు.

రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర, పాత గాజువాక వైఎస్సార్‌ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభం, 17 మంది మంత్రులతో సామాజిక న్యాయభేరి

చెన్నై అపోలో ఆస్పత్రిలో రేపు కోటంరెడ్డికి యాంజియోగ్రామ్, లేజర్ అబ్లేషన్ చేయనున్నారు. ఈ ప్రొసీజర్ పూర్తయిన తరువాత సోమవారం లేదా మంగళవారం తిరిగి ఆయన నియోజకవర్గానికి వస్తారని నెల్లూరు అపోలో వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.